ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇసుకను అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తప్పవని నిర్మల్ ఎ ఎస్పీ సాయి కిరణ్ స్పష్టం చేశారు. భైంసాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు వాహనాలతో పాటు జేసీబీ, ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ధర్మాబాద్ నుంచి బాసర మీదుగా నిజామాబాద్ కు ఇసుక తరలిస్తున్న క్రమంలో వీటిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ రవాణాలో 9 మందిపై కేసు నమోదు కాగా ఐదుగురిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ రవాణా వెనుక సూత్రధారిగా ధర్మాబాద్ కు చెందిన షేక్ రవూఫ్ ను గుర్తించామని గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ రవాణా లో కూడా ఇతను నిందితుడని, హత్య యత్నం కేసు కూడా ఇతనిపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సి ఐ కిరణ్ కూడా ఉన్నారు.