ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ అనన్య
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కలెక్టరేట్ లోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూల గుచ్చెం ఇచ్చి వికారాబాద్ పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ నూతన చైర్ పర్సన్ గడ్డం అనన్య
చిన్న వయసులోనే రాజకీయాలలోకి రావడంతో పాటుగా మొదటిసారే మున్సిపల్ చైర్ పర్సన్ హోదా దక్కడం అదృష్టమని, ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలని తెలిపారు. వికారాబాద్ పురపాలక సంఘం అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
