- ఆ కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరు
- హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది
- రాష్ట్రానికి వెన్నుముఖ అయిన నగరంపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం
- నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం
- ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని వారికి దిశా నిర్దేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :-రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.కేసీఆర్ సారధ్యంలో హైదరాబాద్ సంతోషానికి చిరునామాగా ఉంటే.. నేడు రేవంత్ పాలనా వైఫల్యంతో సవాలక్ష కష్టాలకు కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంగా నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలపై వారితో చర్చించారు. బీఆర్ఎస్ పాలనలో సేఫ్ సిటీకి బ్రాండ్ గా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం క్రైమ్ సిటీగా మారడం, మళ్లీ పెరుగుతున్న భూకబ్జాలతో పాటు గాలికొదిలేసిన లా అండ్ ఆర్డర్ తో నగర ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభద్రతాభావంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్ లో అమలుకావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్ లోని పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. చివరకు ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాని మండిపడ్డారు. చెత్త సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆటోల ప్రయోగంతో విప్లవాత్మకమైన ఫలితాలను గతంలో సాధించగలిగామన్నారు.
కానీ నేడు హైదరాబాద్ లోని ఏ కాలనీ కి వెళ్లి చూసిన ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కనిపిస్తుందన్నారు. ఫలితంగా ఈగలు, దోమల సమస్య పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కూడా రేవంత్ సర్కార్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, అనేకచోట్ల కబ్జాలకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ పాలనా సామర్థ్యంపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఆయనకు పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్ వాసులు పూర్తిగా అర్థం చేసుకున్నారన్నారు. నగర వాసుల కష్టాలు తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిన్నదన్నవారు.ఇది కేవలం హైదరాబాద్ కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
పదేళ్లపాటు దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీ గా, లివెబుల్ సిటీగా అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ర్యాంకింగ్ లో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ గాడితప్పిన పాలన కారణంగా నేడు విలవిలలాడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గ్రోత్ ఇంజన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ కు వెన్నుముక్కైన హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.
Next Post