Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

 

మహాదేవపూర్, ముద్ర:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్ ” రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్సై పవన్ కుమార్, ఎస్సై సాయి శశాంక్ తమ సిబ్బందితో కలిసి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటింపు, రోడ్డును సురక్షితంగా దాటే విధానం వంటి ముఖ్య అంశాలను వివరించారు.
విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు రహదారి భద్రతపై సందేశం చేరేలా ప్రతి విద్యార్థితో తమ తల్లిదండ్రులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించే విధంగా లేఖలు రాయించి, ఆ లేఖలను విద్యార్థులచే పోస్టు ద్వారా వారి తల్లిదండ్రులకు పంపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.