ముద్ర కూకట్‌పల్లి :
ముందస్తు పరీక్షల ద్వారానే మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు” అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు.
నందమూరి బాలకృష్ణ సారథ్యంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో, స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీ వసంత నగర్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ..
ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల పూర్తి జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి క్యాన్సర్ చికిత్స అందిస్తున్న బాలకృష్ణ సేవలను కొనియాడారు. మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందించడం అభినందనీయమన్నారు.
ఈ శిబిరంలో ఇప్పటికే వందలాది మంది మహిళలు, పురుషులు పరీక్షలు చేయించుకున్నారని, నిర్వాహకులు తెలిపారు.
బసవతారకం వైద్య బృందం మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, ఫలితాల ఆధారంగా వెంటనే అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి బాబు చౌదరి, కొప్పిశెట్టి దినేష్ కుమార్, గాదే శివా చౌదరి, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు