జోగినపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ….
అందుబాటులో ఉన్న ట్రైన్ లను ఉపయోగించుకోవాలి….
ఉచిత పథకాలతో రాష్ట్రం అప్పుల పాలు….
కోరుట్ల, ముద్ర;
పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత పథకాల పేరుతో అప్పుచేసి పప్పుకూడు అన్న విధంగా చేసి, సంక్షేమ పథకాలు అంటూ ఒక్కొక్కరి మీద విపరీతమైన అప్పు వేసి ఉచితాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. గురువారం కోరుట్ల మండలంలో జోగినపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం కోరుట్లలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే మిగులు బడ్జెట్ తో చేసేది కానీ అప్పుచేసి అభివృద్ధి చేస్తే అది దేశ రాష్ట్ర ప్రభుత్వాల జిడిపి తగ్గించడంతో పాటు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి సుపరిపాలన అందించారని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఫండింగ్ తోనే కవిత కొత్త పార్టీ పెడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీల మద్దతుతో బీజేపీ పుంజుకుంటుందని కవిత పార్టీకి రేవంత్ రెడ్డి నిధులు సమకూరుస్తున్నారనీ అన్నారు. వైఎస్ టూ అని చెప్పుకుంటూ వైయస్ పేరు రేవంత్ రెడ్డి చెడగొడుతున్నారనీ, వైయస్ హాయంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ అందేది. ఇప్పుడు ఏది ప్రజలకు అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వనందుకు ఎస్టీల కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన 206 కోట్లు వెనక్కి వెళ్లాయన్నారు.
మాజీ జీవన్ రెడ్డి తొందరపడి పార్టీ మారుతున్నారని అన్నారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎక్కడ ఉంటే అక్కడ శని టిఆర్ఎస్ లో ఉండి డాక్టర్ శ్రావణిని, కాంగ్రెస్ లో చేరి జీవన్ రెడ్డిని పంపించాడు.
జీవన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత మళ్లీ బిఆర్ఎస్ లోకి డాక్టర్ సంజయ్ వెళ్లిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అని అన్నారు.
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో పని చేస్తున్నానని చెప్పుకునే సంజయ్ కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఎందుకు చూయించడం లేదు.
సంజయ్ అవగాహన లేకుండా పసుపు రేటు గురించి మాట్లాడుతున్నాడు. పసుపు బోర్డు వలన గతంలో కంటే ఎక్కువగా ధర వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, సీనియర్ నాయకులు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.