కోరుట్ల, ముద్ర
విద్యుత్ శాఖ జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.సుదర్శనం ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ విద్యుత్ నియంత్రికలకు అమర్చిన స్మార్ట్ మీటర్ల ను తనిఖీ చేసి వాటి పని తీరుని పర్యవేక్షించారు. ఈ స్మార్ట్ మీటర్లు నిరంతర విద్యుత్ సరఫరాకు దోహద పడతాయాని తెలియజేశారు. కోరుట్ల పట్టణంలో గల 160 కేవిఏ, ఆపై సామర్థ్యం కలిగిన నియంత్రికలకు ముందుగా అమర్చుతున్నట్లుగా తెలిపారు. అతి త్వరలోనే దానికి సంబంధించిన పనిని పూర్తి చేయించి విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిచెందుకు కృషి చేస్తామన్నారు. విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన రక్షణ పరికరాలను వాడుతు విద్యుత్ ఆక్సిడెంట్లను నివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో మెట్పల్లి డీఈ మధుసూదన్, జగిత్యాల డిఈ టెక్నికల్ గంగారాం, కోరుట్ల ఏడిఈ భూమేశ్వర్, ఏఈ కోరుట్ల శ్యామ్, ఏఈ టెక్నికల్ జగిత్యాల, కోరుట్ల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.