-వైస్ చైర్ పర్సన్ గా మంజుల రాఘవేందర్ రెడ్డి
-ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లు
– చైర్పర్సన్… వైస్ చైర్మన్ ఎంపిక ఓటింగ్ కు ఎంపీ, ఎమ్మెల్యే హాజరు గైర్హాజరైన టిఆర్ఎస్ కౌన్సిలర్లు
-నాగురావు నామాజీ ఆశీస్సులు తీసుకున్న చైర్పర్సన్ కొండా సత్యా యాదవ్
– భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యతమయిన సత్య యాదవ్
ముద్ర, నారాయణపేట :
ఎట్టకేలకు నారాయణపేట మున్సిపాలిటీ బిజెపి కైవసం చేస్తుంది. సోమవారం ఉదయం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్డిఓ రామచంద ర్ రావు ఆధ్వర్యంలో కొనసాగించారు. బిజెపి చైర్పర్సన్ గా కొండ శ్వేత సత్య యాదవ్ కు (ఎక్స్ అఫీషియో) ఎంపీ డీకే అరుణ ఓటుతో కలిపి 13 మంది మద్దతు లభించడంతో చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.అలాగే వైస్ చైర్పర్సన్ గా మంజుల రాఘవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి హాజరై తమ తమ పార్టీ అభ్యర్థుల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక లో బిజెపి విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు లోబడి సంబరాలు జరుపుకున్నారు. నూతన చైర్పర్సన్ కొండా శ్వేతా సత్యా యాదవ్ చైర్పర్సన్ గా ఎన్నికైన వెంటనే నేరుగా బిజెపి సీనియర్ నాయకులు నాగురావు నామాజీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సమయంలో సత్య యాదవ్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యతమయ్యారు.
