Take a fresh look at your lifestyle.

విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి, మెదక్:
విద్యుత్ శాఖలోఅనేక సంవత్సరాల నుండి 23 వేల మంది విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగారు. ఆర్టిజన్ కార్మికులకు అందరికి కూడా కన్వర్షన్ కావాలని,
కార్మికులకు ఏపీఎస్పీ రూల్స్ అమలు చేయాలని, 2016 డిసెంబర్ 4కు ముందు అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా గుర్తించని వారందరినీ ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించాలని, టీజీ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ కంపెనీలో పరిధిలో పనిచేస్తున్న ఆన్ మన్ కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తు సమ్మె చేస్తున్నారు. మొదటి రోజు సమ్మెలో మెదక్ డివిజన్ చెర్మన్ సిహెచ్.నాగరాజు, కార్యదర్శి పృథ్వి రాజ్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా చెర్మన్ బిఎన్ స్వామి, ఉపాధ్యక్షలు పి. ప్రదీప్ గౌడ్, కన్వీనర్ షాదుల్ హుస్సేన్. జిల్లా, డివిజన్ నాయకులు చంద్రభాను. సురేష్, శ్రీశైలం, శరత్, మల్లేష్, జి.రవి, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.