Take a fresh look at your lifestyle.

ఐకేపీల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం.

 
ముద్ర,మోత్కూరు:
రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత పదిహేను రోజులుగా రైతులు ఎదిరిచూస్తున్నారని మండలంలోని పిఏసిఎస్ ,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలోని దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అరుకాలం కష్టపడి పండించిన వరి పంట కోతలు ప్రారంభమై దాన్యాన్ని కల్లాలలో పోసి రైతులు కొనుగోలు కోసం ఎదిరి చుస్తున్నారని మండలంలోని పిఏసిఎస్,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాలయాపన చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. మండలంలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు రైతులను నిలువునా దోపిడీచేస్తున్నారని ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ 2389 లు కాగా, ప్రైవేటు వ్యాపారులు 1500 నుండి 1600 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని,రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం వెంటనే గ్రామాలలో సహకార సంఘాలు ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మద్దతు ధరకు దాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, సైదులు, రైతులు ముక్కాముల మత్స్యగిరి, బద్దం లక్ష్మా రెడ్డి, ముక్కాముల శ్రీశైలం, ముక్కాముల రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.