Take a fresh look at your lifestyle.

కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటన… విద్యార్థులకు బోధన

ముద్ర ప్రతినిధి, మెదక్:
రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాపును పరిశీలించారు. కేజీబీవీలో
మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థినిలకు పాఠాలు బోధించారు
మెనూ సక్రమంగా అమలు చేయాలి, నాణ్యమైన, గుణాత్మక విద్య అందించాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందో, లేదో.. పర్యవేక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


అలాగే భోజన శాలను పరిశీలించి, ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ప్రధానంగా గుడ్ల నాణ్యతను పరీక్షించి, వంట సామాగ్రి, సరుకులు, బియ్యం తదితరాలను తనిఖీ చేసి, గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు.


పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత
గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ పిలుపునిచ్చారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని, దాంతో ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. వివాహానికి ముందు, తర్వాత, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వైద్య పరీక్షలపై అవగాహన కల్పించడం సేఫ్ మదర్ డే ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పి సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డా. సునీత, డిసిహెచ్ఎస్ శివదయాల్, రాజేశ్వరి, ప్రియ దర్శిని సృజన, డి.డబ్ల్యు.ఓ హేమ భార్గవి, డిఎఫ్ఓ జోజి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, డిప్యూటీ డిఎంహెచ్వోలు, పోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, ఏ.ఎన్.యం.లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ప్రైవేట్, ప్రభుత్వ ప్రసూతి వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.