Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమమే ధ్యేయం

  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం- మీరుదొడ్డి భవనం ప్రారంభోత్సవం.

ముద్ర, అక్బర్ పేట-భూంపల్లి: ఈ రోజు భూంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని భూంపల్లి గ్రామ ముద్దుబిడ్డ,తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ.శ్రీ.బక్కి వెంకటయ్య ప్రారంభించారు.ఈ సంధర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ,రైతులు ఎరువులు విత్తనాలు కావలసి ఉంటే చాలా దూరప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారు,అలాగే పెస్టిసైడ్లు ఇతర రసాయనాలు ప్రైవేటు దుకాణాలలో అధిక ధరలకు కొనేవారు,ఇకమీదట రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన గ్రామంలోని ₹20 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మించామన్నారు,మరియు అదనంగా రైతులకు సరసమైన ధరలకు విత్తనాలు ఎరువులు ఇతర ఇంపుట్లు అందిస్తారు అని తెలియజేశారు.రైతు సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామని చైర్మన్ వెంకటయ్య అన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు పరుగుల మందులు మరియు ఇన్పుట్లను అందిస్తుందని అన్నారు.అదనంగా రైతులకు ఆర్థిక సహకారం మరియు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు.భవన ప్రారంభోత్సవం అనంతరం చైర్మన్ వెంకటయ్య చేతుల మీదుగా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ వెంకటయ్య రైతులు వారు ఎదుర్కొన్న సమస్యలను చైర్మన్ గారికి తెలియజేసి,మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అందుబాటులో నిర్మించినందుకు రైతులు,గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి పిఎసిఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి,దుబ్బాక పిఎసిఎస్ చైర్మన్ శేర్ల కైలాసం, మాజీ ఎంపిటిసి అబ్బుల ఉమారాణి నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.