Take a fresh look at your lifestyle.

పోలీస్ సిబ్బంది హెల్మెట్ లేకుండా ఉద్యోగానికి రావద్దు-సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి

 

* పోలీస్ సిబ్బందికి 55 హెల్మెట్ ల పంపిణి
* ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
* అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించకుండా డ్యూటీ లోకి రావద్దని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లొని మహీంద్రా షో రూమ్ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట త్రీ టౌన్ సిబ్బందికి 55 హెల్మెట్ లను ఏసీపీ చేతులమీదుగా అందించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటీంచాలన్నారు. ముఖ్యంగా రాజీవ్ రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు తప్పకుండ హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుఫు తలకు గాయలు కాకుండా కాపాడుకోవచ్చాన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రామస్తుల సహాయంతో యువతకు హెల్మెట్ అందించే కార్యక్రమాలు చెప్పాడుతామన్నారు. అరైవ్, అలైవ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ఇప్పటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నమ్మన్నారు. హెల్మెట్ అందించడానికి చొరవ చూపిన త్రి టౌన్ సీఐ లక్ష్మి బాబును అయన అభిననిందించారు.

Leave A Reply

Your email address will not be published.