ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ, మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.80వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ క్యాదసు నవీన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.