Take a fresh look at your lifestyle.

ఎడ్ సెట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర, శేరిలింగంపల్లి:
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రసారాల వివరాలు తెలిపే షెడ్యూల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ కామన్ ఎంటెస్ట్ టెస్ట్ లో ఉన్నతమైన ర్యాంకులు సాధించేందుకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా బీఈడీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రధాన్యత నిస్తుందని, ప్రభుత్వం భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రాథమిక స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు డిజిటల్ కంటెంట్ జిందా తిలస్మాత్ వలె పనిచేస్తుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎళ్లవేళలా, ఎక్కడైనా టి-సాట్ కంటెంట్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వార అందుబాటులో ఉంటుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. తెలంగాణా ప్రభుత్వం నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షలకు డిజిటల్ కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్న సీఈవో వేణుగోపాల్ రెడ్డిని మంత్రి అభినందించారు. సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మే నెలలో జరిగే ఎడ్ సెట్ పరీక్ష కోసం తెలంగాణ నిరుద్యోగ యువతను సిద్ధం చేసేందుకు పిబ్రవరి రెండవ తేది నుండి మే 11వ తేది వరకూ రోజుకు నాలుగు గంటల పాటు 392 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నామన్నారు. బయాలజీ, పిజికల్ సైన్స్, మాథమేటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులతో 98 రోజుల పాటు టి-సాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యబ్ లో ప్రసారాలు కొనసాగుతాయన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి-సాట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్ ఎం.డి సాధిక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.