Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అంబేద్కర్ పని చేయడం జరిగిందని , ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు . ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించడంతో నేడు ప్రతి పౌరుడు సమాన హక్కులు పొందుతున్నాడని అన్నారు . కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు . అనంతరం కల్వకుర్తి ఆర్టీసీ డిపో నుండి కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.