Take a fresh look at your lifestyle.

కలిసికట్టుగా మాధకద్రవ్యాలను నిర్మూలిద్దాం.. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదాం. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర ప్రతినిధి, కరీంనగర్:

అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దామని కరీంనగర్ జిల్లాను ఇందులో ఆదర్శంగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు.

గురువారం సాయంత్రం జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాధకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా అగ్రస్థానంలో నిలిపేలా సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతున్నామని కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం తదితర అంశాల్లో ఇటీవల ఐదు కేసులు నమోదు చేశామన్నారు. పదిమందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యాసంస్థలకు దగ్గర్లో పాన్ షాపులు సిగరెట్ షాపులు ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ ఆర్డీవోలు కే మహేశ్వర రమేష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, యాంటీ నార్కోటిక్స్ టీం ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.