Take a fresh look at your lifestyle.

పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

ముద్ర మోత్కూరు:
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మండల వనరుల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ సమక్షంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ టి రవి కిరణ్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల పనితీరుపై ప్యానల్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు , పాఠశాల పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీలు, లెసన్ ప్లాన్స్, ఎఫ్ ఎల్ ఎన్, ఉపాధ్యాయుల హాజరు, స్టాక్ రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు వనం వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి ఉపాధ్యాయులు లలిత , సౌజన్య, రాములు,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.