మోత్కూర్, ముద్ర విలేఖరి: మండల కేంద్రంలోని పాటిమట్ల చౌరస్తాలో గల శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాలులో తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల లాగా పనిచేయాలని జగదీశ్వర్ రెడ్డి సూచించారు. అనంతరం కార్యకర్తలకు నిర్వహించిన భోజన కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు గుంపులు గుంపులుగా ఎగబడడంతో ఇది ఆదనుగా భావించిన జీబుదొంగలు తమ పనులు తాను నెరవేర్చారు. వర్షాకాలంలో విత్తన ఎరువులు కొనుగోలు చేయడం కోసం బిఆర్ఎస్ కార్యకర్తలు తమతో తెచ్చుకున్నటువంటి నగదును జేబు దొంగలు దొంగిలించి సమావేశంలో పై చేయి సాధించారు . అనునిత్యం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని, వివిధ గ్రామాలలో దొంగలు హల్చల్ సృష్టించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురైతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఇలాంటి చర్యలు పునర్రావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.