Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్‌లో హిందూ సమ్మేళనం నిర్వహణకు సిద్ధం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా హౌసింగ్ బోర్డ్ బస్తిలోని మైల్స్టోన్ వినాయక మండపం సమీపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మేళనం ఏప్రిల్ 3, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మిలియన్ వినాయక మండప ప్రాంగణంలో జరగనుంది.
ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ పాల్గొని భారతదేశ వైభవం, కర్తవ్యభావం, పుణ్యభూమి విలువలను గుర్తుచేసుకుంటూ సమాజంలో ఐక్యతను పెంపొందించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. హిందువుల ఐక్యత, ధర్మ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు సంస్కృతి బలోపేతం చేయడం ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ దయానందగిరి స్వాములవారు హాజరవుతుండగా, ప్రధాన వక్తగా శ్రీ కృష్ణగిరి కొలిచ్చెర శంకర్ గారు ప్రసంగించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సేవిక సమితి, హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి సులోచన గారు కూడా పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమానికి వివిధ సమితుల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరుకానున్నారు. హిందూ సమ్మేళనం విజయవంతం కావడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.