హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు
ఏండ్లుగా పన్ను బకాయిలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు చెందిన హైదరాబాద్ లోని తన నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు.హైదరాబద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత విల్లాకు 1.60 కోట్ల రూపాయలు ఇంటి పన్ను బకాయిలు ఉండటంతో జీహెచ్ ఎంసీ అధికారులు విల్లాను సీజ్ చేశారు. గత కొంత కాలంగా ఇంటి పన్ను బకాయిలు పెండింగ్ లో ఉండటం, పలు మార్లు నోటీసులు ఇచ్చినా, ఎవరూ స్పందించకపోవడంతో జయలలికు చెందిన హైదరాబాద్ నివాసాన్నిస్వాధీనం చేసుకున్నారు.
ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారావేత్త విజయ్ మాల్య లీజుకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ మాల్యా లీజుకు తీసుకున్న నాటి నుండి నేటి వరకూ ఇంటి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో , పెండింగ్ బకాయిలు పేరుకుపోయినట్లుగా అధికారులు గుర్తించారు.తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన జయలలిత, ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు తమిళనాడు ప్రజలకు సేవలందిచారు. తమిళనాడు ప్రజలు ఆమెను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.నేటికీ తమిళనాడులో జయలలిత క్రేజ్ తగ్గలేదు. ఆమె భౌతికంగా లేనప్పటికీ , ఆమె అభిమానులు, నాయకులు పెద్దసంఖ్యలో ఉన్నారు. తమినాడు రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా అమ్మ ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు.