Take a fresh look at your lifestyle.

గిరిజన డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహిళ, మెదక్. 2022-2025 విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కళాశాల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కేవలం విద్యానే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, నైపుణ్యాలను పెంపదించుకోవాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. ఉమాదేవి మాట్లాడుతూ… విద్యార్థులు తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ యూనివర్సిటీలలో ర్యాంకులను సాధించి కళాశాలకు వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగాలను సంపాదించి జీవితంలో స్థిరపడాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణి కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి విజయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శరదీపిక, అల్యూమిని అసోసియేషన్ ఆఫీసర్ అర్చనకులకర్ణి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.