Take a fresh look at your lifestyle.

పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

ముద్ర,రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న కొడిమ్యాల రిచిత అనే విద్యార్థిని కి ఇదే పాఠశాల లో 2002- 03 పదవ తరగతి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు తన విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తామన్నారు.ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఈ విద్యార్థికి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తు మానవత్వాన్ని చాటుకుంటున్నారు.అలాగే ఆ విద్యార్థి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. తన తోటి పాఠశాల విద్యార్థులు ఆర్థిక సాయం చేయడంతో రిచిత కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాయికల్ పట్టణ ఎస్సై సుదీర్ రావు మరియు మున్సిపల్ కమిషనర్ మనోహర్ చేతుల మీదుగా ఈ నగదు ని అందజేశారు.పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ పిల్లలకు ఆశీర్వచనాలు ఇచ్చి వాళ్ళు జీవితం లో రాణించాలని ఆకాంక్షిస్తూ వచ్చిన అతిథులను శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.