Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్

‘పుర’పీఠాలు ‘హస్తా’గతం..?
కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్
హస్తం ఖాతాలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం
నిజామాబాద్, కరీంనగర్‌లో వికసించనున్న కమలం
ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేని స్థితిలో బీఆర్ఎస్
మున్సిపాలిటీల్లోనూ పాగా వేయనున్న కాంగ్రెస్
‘పీపుల్స్ పల్స్’ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల్లో వెల్లడి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత… పోలింగ్ సరళికి అనుగూణంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్‌ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్‌ ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68-76, బీఆర్ఎస్ 29-36, బీజేపీ 3-5, ఎంఐఎం 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది. ఇదీలావుంటే.. నిజామాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేదని స్పష్టం చేసింది. కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా పరిశీలిస్తే… రామగుండంలో కాంగ్రెస్ 30-34 డివిజన్లు హస్తాగతం చేసుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 డివిజన్లు గెలుపొందే అవకాశం ఉందని చెప్పింది.మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 డిజవిన్లు, కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 స్ధానాలు, మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 డివిజన్లు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. ఇక నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 స్ధానాలు, నిజమాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 డివిజన్లు, కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 స్ధానాల్లో గెలుపొందే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేల్చిన పీపుల్స్ పల్స్… . 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంటుందనీ, 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని అంచనా వేసింది.

Leave A Reply

Your email address will not be published.