మెదక్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అరెస్ట్.. పూచికత్తుపై బెయిల్ మంజూరు – ఖండించిన హరీశ్ రావు, పద్మ
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్ ను పట్టణ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మెదక్ కోర్టులో ప్రవేశ పెట్టగా సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
వివరాలిలా ఉన్నాయి…
మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ కథనం ప్రకారం...
పట్టణంలోని పిట్లంబేస్ వీధిలో నివాసముంటున్న మహ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై ఫిబ్రవరి 9న దాడి చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గాడ్, మల్లారెడ్డిపేటకు చెందిన గణేష్, శ్రీను, సురేష్ తదితరులపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నాడని ఆరోపిస్తూ, బలవంతంగా ఇంట్లోకి చొరబడి మహ్మద్ ఇమ్రాన్ భార్య, పిల్లలు, సోదరిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో మెదక్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శనివారం ఉదయం మల్లికార్జున్ గౌడ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు.
గతంలో మెదక్ ఎమ్మెల్యేపై దాడికి సంబంధించి నమోదైన కేసులో హైకోర్టు నుంచి స్టే ఉన్నందున, ఆ కేసులలో అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయవాదులు ఎం. దేవుందర్ రెడ్డి, మాయ వెంకటేశం, జీవన్ రావు, ప్రశాంత్ వాదించగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
మల్లికార్జున్ గౌడ్‌పై అక్రమ కేసులు దారుణం- మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ నాయకులు కక్షకట్టారని, ఇప్పటికే ఆయనపై నాలుగు తప్పుడు కేసులు పెట్టారని ఆ కేసుల్లో ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చినా ఎలాగైనా జైలుకు పంపాలన్న దురుద్దేశంతో వెంటనే మరో కొత్త అక్రమ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు.
అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు మారాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయలుగా పోలీస్ స్టేషన్లు: పద్మ

పోలీస్ స్టేషన్ లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయలుగా మారాయని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎం.పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే మేమే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయడం లేదన్నారు. హై కోర్ట్ స్టే ఇచ్చిన వ్యక్తలను అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు మార్గదార్శకలు ఉన్నప్పటికీ పట్టణ పోలీసులు అత్యుత్సాహం చూపించి మల్లిఖార్జున్ గౌడ్ ను అరెస్ట్ చేశారన్నారు. నిబంధనలు అతిక్రమించి కేసులు పెడితే పోలీసుల బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ విషయంలో హెచ్ఆర్సీకి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు న్యాయస్థానానికి వెళ్తామన్నారు.
కుట్ర పూరితంగా కేసులు:మల్లిఖార్జున్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నేటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కుట్రపన్ని అక్రమంగా కేసులు పెట్టారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ఆరోపించారు. నాకు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పట్టణ సీఐ తన సిబ్బందితో వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్ట్ చేశారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టిన వారిని న్యాయస్థానానికి ఈడుస్తామని హెచ్చరించారు.
న్యాయవాది, బీఆర్ఎస్ నాయకులు ఎం. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
మల్లికార్జున్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే చెప్పిన వారి పైన పోలీసులు కేసులు పెడుతూ ఇష్ట రితిగా ప్రవర్తించడం