ముద్ర కాప్రా
భారత సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని శ్రీ లలితా త్రిపుర సుందర ఆలయ పీఠాధిపతి స్వామి శ్రీ బ్రహ్మానంద సరస్వతి అన్నారు. కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. హిందువులంతా ఐక్యతతో మెలగాలి , కులవర్గ భేదాలు ఉండకూడదు అప్పుడే భారత సాంప్రదాయాలు ముందుకు వెలుతాయని అన్నారు. మానవులందరూ ఒకే దైవంశం సంభూతులు కాబట్టి వారి మధ్య భేదాలు చూపడం సరైనది కాదని, వర్ణ వ్యవస్థ కేవలం గుణం, కర్మ ఆధారంగా ఉంటుందని అన్నారు. ప్రతి హిందువు ఆలయాలలో పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలి, వాటి పరిరక్షణకు ముందుండాలి, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షణ కోసం, దేశ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలు సూర్యనారాయణ మూర్తి దీప వేముల కాప్రా హిందూ సమ్మేళనా సమితి అధ్యక్షులు కొండల్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి ,కార్యదర్శి వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి విజయలక్ష్మి, కోశాధికారి అరిసి కృష్ణ పాల్గొన్నారు.