Take a fresh look at your lifestyle.

రామయ్యను దర్శించుకున్న మంత్రి పొంగులేటి దంపతులు 

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : భద్రాచలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు గురువారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణి మాధురితో కలిసి స్వామి వారిని దర్శించుకున్న  శ్రీనివాస్ రెడ్డి,  ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి  తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి దంపతులకు పలువురు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతుల వెంట భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఆయన సతీమణి ప్రవీణ తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.