Take a fresh look at your lifestyle.

చైత్ర పౌర్ణమి వేల సలేశ్వరంలో జన మేళ

  • సలేశ్వరంలో చైత్ర పున్నమి భక్తుల సునామి.

ముద్ర,అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాపురం గ్రామ సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకుని భక్తులు పరవశించిపోతారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం నుండి అలహాబాద్ చౌరస్తా వరకు శ్రీశైలం రోడ్డులో వెళ్లి అక్కడి నుండి 16 కిలోమీటర్లు ఫారెస్ట్ అధికారుల చెక్పోస్ట్ దాటి మట్టి రోడ్డులో ప్రయాణం చేయవలసి ఉంటుంది అటవీ అధికారుల ఆంక్షల మేరకు రెండు దగ్గర చెక్పోస్టులు పెట్టి అలహాబాద్ నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలను అనుమతిస్తారు ఆ తర్వాత కాలినడకన కొండలు లోయలు గుట్టలు రాళ్లు దాటుకొని అత్యంత సాహసోపేతంగా ఈ యాత్రను కొనసాగించవలసి ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తున్నాం లింగమయ్య అంటూ ఆ శివయ్య పై భారం వేసి కాలినడకను ప్రారంభిస్తారు మోకాళ్ళ కురువ అనే ప్రదేశం వద్ద ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంటుంది కాలు జారితే లోయలో పడే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీటిని దాటుకొని సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకొని భక్తులు పరవశించిపోతారు.

  • భారీగా వాహనాలు ఇక్కట్లలో అధికారులు.

పరహాబాద్ నుండి రాంపూర్ పెంట వరకు వాహనాలు భారీగా రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులు పోలీసులు వాహనదారులతో కలిసి సమన్వయంతో ట్రాఫిక్ జామ్ ను సరి చేశారు పౌర్ణమి నాడు రాత్రి వేళల్లో జనాలు అత్యధికంగా రావడం ఎందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.

  • అధికారుల పర్యవేక్షణలో.

జిల్లా యంత్రాంగం పోలీస్ మరియు ఆరోగ్య అటవీ శాఖ అధికారులు గట్టి భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేశారు నిరంతరం భక్తుల వాహనాలను భక్తులను పర్యవేక్షించారు రాంపూర్ పెంట శనేశ్వర క్షేత్రం వరకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం 5 మంది సీఐలు 22 మంది ఎస్సైలు 375 మంది పోలీస్ హోంగార్డులు బందోబస్తు పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.అటవీ అధికారి డి ఎఫ్ ఓ రోహిత్ రెడ్డి గోపిడి ఆధ్వర్యంలో 130 మంది చెంచు వాలంటీర్లు అటవీ సిబ్బంది చేసినట్లు తెలిపారు. సలేశ్వరం వచ్చే భక్తులకు ప్లాస్టిక్ నిషేధం గురించి భద్రతల గురించి సూచనలు తెలిపారు.

  • 32 ప్రత్యేకమైన బస్సులు.

సలేశ్వరం జాతర మొదటి రోజు శుక్రవారం నుండి అచ్చంపేట డిపో నుండి 32 ట్రిప్పులు మరో నాగర్ కర్నూల్ నుండి 15 ట్రిప్పులు ప్రయాణికులతో కుల్లాయపల్లి పెంట వరకు బస్సులలో చేరవేశారు అక్కడి నుండి లోకల్ ఆటోల ద్వారా మోకాళ్ళ కురువ వరకు ప్రయాణికులను చేరవేశారు.

  • భక్తులకు నిత్య అన్న ప్రసాదం మరియు నీటి వసతి.

ప్రతి సంవత్సరం సలేశ్వరం వచ్చే వేలాది భక్తులకు మోకాళ్ళ కురువ వద్ద స్వచ్ఛంద సంస్థలు నాగర్ కర్నూల్ కు చెందిన భక్తులు గత 25 సంవత్సరాల నుండి ఉదయం పూట అల్పాహారం మరియు మంచినీరు మధ్యాహ్నం వేల భోజనము మజ్జిగ రాత్రి వేళ అల్పాహారము భోజనము ఏర్పాటు చేశారు. పర్యావరణ హితమైన పేపర్ ప్లేట్లు మరియు పేపర్ గ్లాసులు వాడుతున్నట్లు తెలిపారు. వాసవి సేవా సమితి వారు సలేశ్వరం లింగమయ్య వద్ద నిత్య అన్న ప్రసాదం ప్రతి సంవత్సరం చేస్తారు.

  • జన జాతర.

సుమారు60వేల నుండి లక్ష మంది వరకు పౌర్ణమి రోజు సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వస్తారని అధికారులు వెల్లడించారు.

  • స్థల చరిత్ర.

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర చరిత్ర వరకు వెళ్తే క్రీస్తు శకం ఆరవ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మొదటగా ప్రాచుర్యంలో ఉండేది కాలక్రమంగా శైలేశ్వర తీర్థముగా తర్వాత సర్వేశ్వర తీర్థంగా తర్వాత నేటి ఉచ్చరణ సలేశ్వరం తీర్థంగా మారింది చత్రపతి శివాజీ సలేశ్వర క్షేత్రంలో ఈ యొక్క శివలింగాన్ని పునః ప్రతిష్టించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మరియు సలేశ్వర శివలింగం ఒకే మాదిరిగా ఉండటం ఒక విశేషం .ఇక్కడ 1000 అడుగుల నుండి నీరు ధారగా పడి ప్రకృతి రమణయానికి అద్దం పట్టేలా ఉంటుంది నాలుగున్నర అడుగుల ముందు చతుర్ముఖ వీరభద్రస్వామి వెలసి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది చైత్ర పున్నమి వేల ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Leave A Reply

Your email address will not be published.