Take a fresh look at your lifestyle.

నేటి నుండి జి-మ్యాట్ పై టి-సాట్ లో స్పెషల్ లెసన్స్

మాదాపూర్, ముద్ర విలేఖరి: గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జి-మ్యాట్) 2025 సాధించేందుకు వీలుగా అభ్యర్థులకు టి-సాట్ ఈ నెల 19వ తేదీ నుండి స్పెషల్ లెసన్స్ ప్రసారం చేయనుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ మల్టీపుల్ ఛాయిస్ పద్దతిలో జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షకు విదేశీ విద్య, బిజినెస్, మార్కెటింగ్ విభాగాల్లో అవకాశాలు కోరుకునే వారికి టి-సాట్ చేసే ప్రసారాలు అభ్యర్థుల నైపుణ్యాన్ని పెంచేవిధంగా ఉంటాయన్నారు. మే నెలలో నిర్వహించే పరీక్షలనుద్దేశించి ఏప్రిల్ 19వ తేది శనివారం నుండి ప్రారంభమయ్యే ప్రసారాలు 30 రోజుల పాటు ఒక్కో ప్రొగ్రామ్ చొప్పున ఏప్రిల్ 18వ తేది వరకు ప్రతి రోజూ అరగంటపాటు ఉదయం ఎనిమిది నుండి ఎనిమిదిన్నర గంటల వరకు నిపుణ, సాయంత్రం ఆరుగంటల నుండి ఆరున్నర గంటల వరకు విద్య ఛానల్ లో పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయని సీఈవో వివరించారు. క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ మరియు డాటా ఇన్ సైట్స్ సిలబస్ నుద్దేశించి ఆల్జిబ్రా-అర్థమెటిక్, రీడింగ్ కాంప్రహెన్షన్-క్రిటికల్ రీజనింగ్, డాటా సఫీషియన్సీ, మల్టీ సోర్స్ రీజనింగ్ తదితర అంశాల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసి ప్రసారం చేస్తున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా బిజనెస్ స్కూళ్లలో విద్యనభ్యసించి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాల్లో ఉద్యోగం పొందాలనుకునే వారు ఈ ప్రసారాలను తప్పని సరిగా వినియోగించుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

  • వరల్డ్ ఎర్త్ డే’ పై స్పెషల్ లైవ్.

ఏప్రిల్ 22వ తేది మంగళవారం రోజున ‘వరల్డ్ ఎర్త్ డే’ పురస్కరించుకుని టి-సాట్ నెట్వర్క్ ఉదయం 11 గంటలకు ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, సామాజిక వేత్తలు ప్రత్యేక ప్రసార కార్యక్రమంలో పాల్గొని ‘వరల్డ్ ఎర్త్ డే’ ప్రాధాన్యతను తెలియజేస్తారని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.