Take a fresh look at your lifestyle.

దుండిగల్ పి.యస్ పరిధి బౌరంపేట్ లో కసాయి తల్లి కర్కాశత్వం…

రెండు నెలల బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి….

కట్టెల పోయిలో వేసి కాల్చి……..

 ఏడువకుండా నోట్లో గుడ్డలు కుక్కి,కళ్ళు కట్టేసిన కసాయి తల్లి

ముద్ర,కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో దారుణం జరిగింది. రెండు నెలల పసికందును కన్న తల్లి ఇవాళ కట్టెల పొయ్యిలో వేసి దారుణంగా హతమార్చింది. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నౌట్గాంకు చెందిన మమత – రాజేందర్ ప్రేమ వివాహం చేసుకొని కొన్ని నెల క్రితం హైదరాబాద్కు వలసొచ్చారు. బౌరంపేటలోని సనరెల్లి అపార్ట్మెంట్లో డైలీ లేబర్స్ గా పని చేస్తున్నారు. వారికి సూర్య అనే రెండు నెలల బాబు ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం తల్లి తన కొడుకు నోట్లో గుడ్డలు కుక్కి కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం  చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కన్న తల్లే.. బిడ్డపై కర్కశత్వంగా ప్రదర్శించి దారుణంగా హత్య చేయడం సానికంగా కలకలం రేపుతోంది. బిడ్డను చంపిన తల్లిని కఠినంగా శిక్షించాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. మానసిక ఒత్తిడితో ఈ పని చేసిందా?.. లేక భార్యా భర్తల మధ్య గొడవతోనా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా నిన్న రాత్రి నుంచి చిన్నారి ఏడుస్తూ ఉండడంతో తల్లి.. బిడ్డ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.మంగళవారం మద్యాహ్నం పన్నెండు గంటల సమయంలో 100 డయల్ ద్వారా సమాచారం అందుకొన్న దుండిగల్ పోలీసులు.బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్పీడ్ సానరెల్లి భవన నిర్మాణంలో దుర్గటన జరిగింది
సంఘటన స్ధలం ను ఏ.సి.పి శంకర్ రెడ్డి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.ఘటన స్థలాన్ని చేరుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహం తరలించారు.ప్రాధమిక దర్యాప్తు లో మద్య ప్రదేశ్ కు చెందిన నౌగ్రామ్ అనే గ్రామానికి చెందిన మమత,రాజేందర్ సానరెళ్ళి అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా మరియు కూలీలుగా పనిచేస్తున్నారని
ఎందుకు బాలుడిని చంపవలసి వచ్చిందో దర్యాప్తు చేస్తున్న దుండిగల్ పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.