Take a fresh look at your lifestyle.

ఎంతో మంది ఉసురుపోసుకున్న నీచుడు ప్రభాకర్

  • భార్యభర్తలు ఫోన్ లో మాట్లాడుకోలేని దుస్థితి కల్పించాడు.
  • ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు బయటపెట్టాలి.
  • పథకం ప్రకారమే ప్రభాకర్ లొంగిపోయాడు.
  • కేంద్రమంత్రి బండి సంజయ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎంతోమంది ఉసురుపోసుకున్న నీచుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ మామూలోడు కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యారని ఆయన ఆరోపించారు.అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంత్తు పూర్తియ్యిందని ఆయన అన్నారు. తనలాంటి అనేక మంది బీజేపీ కార్యకర్తల ఉసురుపోసుకున్న వ్యక్తి ప్రభాకర్ రావు అని బండి సంజయ్ మండిపడ్డారు. సిట్ విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, తనపైన, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, పలువురు న్యాయమూర్తి ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాప్ చేసిన ఘనుడని ఆయన దుయ్యబట్టారు. ప్రభాకర్ రావు వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడినాయని, చివరాఖరుకు భార్యభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అని అన్నారు. ప్రభాకర్ రావు వలన భార్యభర్తలు ఫోన్‌లో మాట్లాడుకోలేని దుస్థితి కల్పించారని అన్నారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ నొక్కి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు?, ట్యాపింగ్ ఆడియోలను ఎవరకి పంపారు?, ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అనే అంశాలు బహిర్గం కావాల్సిన అవసరం ఉందన్నారు.కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగలేదని బండి సంజయ్ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.