ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిజ్ఞాస కార్యక్రమంలో భాగంగా నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యాపకుడు వెంకట్ రెడ్డి తో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. కలెక్టరేట్ లో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ ను కలిసి బ్యాంకింగ్ కార్యకలాపాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలకు అనుసంధానం చేయటంపై వివరాలు సేకరించారు.