Take a fresh look at your lifestyle.

అది క్యాబినెట్ నిర్ణయమే..!

  • కేబినెట్ ​లో ఆమోదించాం.
  • టెక్నికల్​ నిర్ణయాలన్నీ ఇంజినీర్లు తీసుకున్నారు.
  • బ్యారేజీల్లో నీళ్లు నింపేదంతా ఇంజినీర్ల నిర్ణయమే.
  • తుమ్మడిహట్టి దగ్గర నిర్మాణం చేసేందుకు ప్రయత్నించాం.
  • కానీ, మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. నీటి నిల్వ అంతగా లేదు.
  • అందుకే టెక్నికల్​ రిపోర్ట్స్​, వ్యాప్కోస్​ సంస్థ నివేదిక ఆధారంగా మేడ గడ్డకు మార్పు.
  • కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చాయి.
  • నిధుల కోసం కార్పొరేషన్​ ఏర్పాటు చేశాం.
  • ప్రాజెక్టు స్వరూపం, అనుమతులపై కమిషన్​కు పుస్తకం.
  • కాళేశ్వరం కమిషన్​ ముందు విచారణకు హాజరైన కేసీఆర్​.
ముద్ర, తెలంగాణ బ్యూరో:  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ ను  50 నిమిషాల పాటు జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్​ విచారించింది. మాజీ ముఖ్యమంత్రికి 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్​ విచారించింది. జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని, అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని మాజీ సీఎం కోరారు. కేసీఆర్​ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్​ పీసీ ఘోష్​ మీడియా, ఇతరులు లేకుండానే ఆయన​ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్ కు ఆయన  ఒక​ నివేదికను కు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ నివేదికను కూడా ​ అందించారు. కాగా ఈ విచారణలో కేసీఆర్ ను కమిషన్  మొత్తం​ 18 ప్రశ్నలను అడిగింది. వాటిల్లో ప్రదానంగా ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్​ అడగ్గా, కాళేశ్వరం రీఇంజినీరింగ్​ గురించి కేసీఆర్​ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్​ ఆమోదం ఉందా? అని కమిషన్​ ప్రశ్నించింది. అందుకు సమాధానంగా కేబినెట్​ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్​ చెప్పారు. అలాగే వ్యాప్కోస్​ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్నారు. ఈ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్ ​కు కేసీఆర్​ అందించారు. కాళేశ్వరం కార్పొరేషన్​ గురించి జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్​ ఏర్పాటు చేశామని కేసీఆర్​ తెలిపారు. కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్​ ఏర్పాటు చేశామన్నారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్​ను కమిషన్​ వివరణ అడగ్గా, ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని ఆయన సమాధానం ఇచ్చారు.బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు, సాంకేతిక అంశాలు,నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు కేసీఆర్​ వివరించారు. జీవో నంబర్​ 45ను కమిషన్ ​కు కేసీఆర్​ ఇచ్చారు. ఆపరేషన్స్​ అండ్​ మెయింటేనెన్స్ ​ బొక్కును కూడా కమిషన్ కు సమర్పించారు.
  • కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం.
అలాగే బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వచేయాలని మీరు ఆదేశాలు ఇచ్చారా? అని కమిషన్ ఆయనను​ అడగగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన బదులిచ్చారు. నీటిని మళ్లించేందుకు ఎంత నిల్వ చేయాలన్నది సాంకేతిక బృందం చూసుకుంటుందని తెలిపారు.నీటి నిల్వ అనేది రాజకీయపరమైన నిర్ణయం కాదన్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల కాళేశ్వరం కార్పొరేషన్ కు ఆదాయం రాలేదని చెప్పారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినందున ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని కేసీఆర్​ వివరాలు వెల్లడించారు. మూడు చోట్ల ఆనకట్టలు కట్టాలని వ్యాప్కోస్​ సిఫారసు చేసిందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్​ విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఒక ఈఈ అక్కడ అందుబాటులో ఉండేలా చూశామని తెలిపారు. ఆపరేషన్​, నిర్వహణ కోసం రూ.280 కోట్లు కేటాయించామని కమిషన్ కు కు కేసీఆర్​ వివరించారు.కాగా రీ ఇంజినీరింగ్​ అంశాన్ని 4 వేల మంది ఇంజినీర్లు పరిశీలించారని ​ తెలిపారు. తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని కేసీఆర్​ వివరించారు. ఎస్​ఆర్​ఎస్​పీ మొదలు గోదావరి మొత్తం వ్యాప్కోస్​ సంస్థ సర్వే చేసిందని కమిషన్ ​తో పేర్కొన్నారు.
  • బహిరంగంగా వద్దు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు  హాజరైన కేసీఆర్ తనకు స్వల్ప జలుబు, అనారోగ్యం ఉందని తెలిపారు. ఈ కారణంగా ఓపెన్ హాల్‌లో ఫేస్-టు-ఫేస్ విచారణ కాకుండా వ్యక్తిగతంగా వన్-టు-వన్ ‘ఇన్‌కెమెరా’ విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీ చంద్రఘోష్, ఓపెన్ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపి విచారించారు. గత 14 నెలలుగా అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రుల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందుకు తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కూడా కేసీఆర్ కమిషన్‌కు వివరించారని సమాచారం.కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్‌కు అందజేశారు.
  • నేనెలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్ మరో ప్రశ్న సంధించింది. లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందన్నారు. నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్ చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు మాజీ సీఎం. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
  • అసలు ఎవరి నిర్ణయం.
విచారణ సందర్భంగా కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్‌ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈక్రమంలో కాళేశ్వరం రీఇంజినీరింగ్‌ గురించి కేసీఆర్‌ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం ఉందా అని కమిషన్‌ ప్రశ్నించింది. క్యాబినెట్‌, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్‌ బదులిచ్చారు. వ్యాప్కోస్‌ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ గురించి కమిషన్‌ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను కమిషన్‌ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని కేసీఆర్‌ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. జీవో నంబర్‌ 45ను, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బుక్‌ను కమిషన్‌కు అందజేశారు.
  •  కమిషన్ ప్రశ్నలు..కేసీఆర్ సమాధానాలు
కమిషన్  : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు .?
కేసీఆర్ : పెద్ద ప్రాజెక్టు కాబట్టి  ముందుగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.టెక్నికల్ నిర్ణయాలు అన్ని వందకు వంద శాతం ఇంజనీర్లు తీసుకున్నారు
కమిషన్:  బ్యారేజీలలో నీళ్లను నింపమని మీరు ఆదేశించారా?
కేసీఆర్ : నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు.
కమిషన్ : బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారు?
కేసీఆర్ :టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్త నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయి. తుమ్మిడిహాట్టి దగ్గర బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు.మేడిగడ్డ వద్ద 230 TMC నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.ప్రాజెక్టుకు కావలసిన అన్ని సర్వేలు చేశాం. కేంద్రం నుంచి రావలసిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.