ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సైబర్ నేరాలు పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల డిఎస్సీ రఘు చందర్ పేర్కొన్నారు.భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు డిఎస్పి ఫోక్సో చట్టం, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. డిఎస్పి మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మీరు విద్యార్థులను చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉంచాలని, మత్తు పదార్థాల బారిన పడకుండా విద్యార్థులను సరైన మార్గదర్శనం చేయాలన్నారు. జగిత్యాల జిల్లా విద్యాధికారి కె రాము సైబర్ నేరాలకు సంబంధించిన విషయాలపై ఉపాధ్యాయులకు లోతైన అవగాహన కల్పించాలని రిసోర్స్ పర్సన్ లైన శ్రీనివాస్ రావు, చంద్రశేఖర్, రాజ్ కుమార్, జగదీశ్వర్, కృష్ణ సాయిలకు సూచించారు.