Take a fresh look at your lifestyle.

అసంపూర్తి పనుల పూర్తిపై ఫోకస్- మల్కాజిగిరి ఎంపీ ఈటల

నేడు రెండు ర్లైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్ధాపన
త్వరలోనే మరిన్ని పనులకు భూమి పూజ
ముద్ర, మల్కాజిగిరి :

తన నియోజకవర్గ పరిదిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభించుకోనున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మేడ్చల్ సమీపంలో పూర్తయిన గిర్మాపురం వద్ద బ్రిడ్జి పూర్తి చేసుకున్నామన్న ఆయన మరో రెండు రోజుల్లో దాన్ని ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ కమ్యూనిటీ హాల్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా చేపట్టే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టుల పనులు సమన్వయ లోపంతో నత్త నడక నడిచేవన్నారు. 1993లో బొల్లారం దగ్గర ఫ్లైఓవర్ మంజూరు కాగా.. భూసేకరణ సమస్యతో 30 ఏండ్లు గడిచిన నిర్మాణం పూర్తి కాలేదన్నారు. వాజ్పేయి నగర్ లో కూడా శిలాఫలకాలు వేశారు కానీ పని కాలేదన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలో వచ్చిన తర్వాత పనుల్లో వేగం పుంజుకుందన్నారు. ప్రజలకు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను గ్రహించిన కేంద్ర సర్కార్… రైల్వే ప్రాజెక్టుల పూర్తిపై దృష్టిపెట్టిందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గతంలో గౌరవెల్లి వద్ద మంజూరైన ఒక బ్రిడ్జి నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ కాక, ఫండ్స్ ఇవ్వలేక నత్తనడకన నడిచాయన్నారు. ప్రస్తుతం ఆ పనులు పూర్తయ్యాయన్నారు. ఈఏడాది లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. వీటితో పాటు గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి దగ్గర ఫోర్ వే అండర్ బ్రిడ్జిని 2026 పూర్తయ్యలోపు పూర్తి చేస్తామన్నారు. గుండ్ల పోచంపల్లి, తుర్కపల్లి, జనప్రియ, మచ్చ బొల్లారం, లయోలా కాలేజ్, ఓల్డ్ ఆల్వాల్ దగ్గర రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల పనుల టెండర్లకు భూమి పూజ చేస్తామన్నారు. షాఫిల్ గూడా, వాజ్పేయి నగర్, వినాయక నగర్, ఉప్పరగూడ, ఆనంద్ బాగ్ ఇలా ఆరేడు ప్రాంతాలలో అండర్ పాసులు పెండింగ్లో ఉన్నాయనీ వాటిలో ఒక్కటీ పూర్తి కాలేదన్నారు. నేడు 11 గంటలకు సఫిల్ గూడా, వాజ్పేయి నగర్ దగ్గర ర్లైల్వే అండర్ బ్రిడ్జి పనులకు భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. వీటితో పాటు కాకతీయ నగర్, గౌతమ్ నగర్, చంద్రగిరి కాలనీ, ఉప్పరగూడ, ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.