నగరానికి మూసీ నది లైఫ్‌లైన్
మూసీ నదిపై 30 ఏళ్లుగా
మంచి పాలసీ ఏదీ లేదు
మేం ఉత్తమ విధానాన్ని ఎంచుకుంటున్నాం
ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయో
అర్థం కావడం లేదు
హైదరాబాద్ మహా నగరాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాలంటే మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో 2 కోట్ల జనాభాకు చేరుకునే ఈ నగరానికి అవసరమైన అన్ని వసతులు కల్పించాలంటే ఉత్తమమైన కార్యాచరణ ప్రణాళికను అనుసరించాలని చెప్పారు. తెలంగాణకు ఆయువుపట్టైన హైదరాబాద్ నగరం ఆర్థికంగా, పర్యావరణ పరంగా, సాంస్కృతిక పరంగా, వారసత్వ పరంగా మరింత ఎత్తుకు ఎదగాలంటే జీవరేఖగా ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేయాలని అభిలషించారు. ఇందుకోసం తాను 2 ఏండ్ల నుంచి నిరంతరం అధ్యయనం చేస్తున్నానని, అనేక మంది నిపుణులతో చర్చిస్తున్నాని సీఎం తెలిపారు.