ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
…………………………………
కారును బైక్ ఢీ కొన్న సంఘటనలో లో ఐదుగురు దుర్మరణం చెందారు.ఈ ప్రమాదం మహబూబ్ నగర్ పట్టణం సమీపలోని బై పాస్ రహదారి పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్టల్(25) ఫ్రెండ్ తో కలిసి స్పోర్ట్స్ బైక్ పై మహబూబ్ నగర్ నుంచి బై పాస్ రహదారి మీదుగా వెళుతున్న సమయంలో పాలకొండ చొరస్తా వద్ద మలుపు తీసుకుంటున్న కార్ ను ఢీ కొట్టారు.

ఈ ప్రమాదం లో కార్ పాల్టీలు కొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు ఎగిరి రోడ్డు పై పఢీ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కార్ లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు కారులోనే ఇరుక్కుని తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఉజేప(7), అమర్ (2)తో పాటు అర్షియా బేగం(30) ఉన్నారు.మహబూబ్ నగర్ పట్టణం లోని ప్రేమ్ నగర్ కు చెందిన వీరు బై పాస్ రహదారిలోని పిస్తా హౌస్ హోటల్ లో బర్త్ డే పార్టీ చేసుకుని తిరుగు ప్రయాణం లో పాల కొండ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న వీరి కారు ను అతివేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది.కారు లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రూరల్ పోలీసు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………….
పోలీసుల నిర్లక్ష్యం :
……………………………………..
బై పాస్ రహదారిలో జరిగిన ప్రమాదం లో పోలీసుల నిర్లక్ష్యం ఎంతో ఉందని స్థానికులు మండిపడుతున్నారు.పాలకొండ బైపాస్ రోడ్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై మరిన్ని విషయాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం రద్దీతో ఉండే బైపాస్ రోడ్డుపై కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్ నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ఈ దారుణానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిని రేసింగ్ ట్రాక్‌లా మార్చడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో బైక్ రేసింగ్‌లు, స్టంట్లు పెరిగిపోతున్నప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తర్వాతైనా పాలకొండ బైపాస్‌పై కట్టుదిట్టమైన నిఘా, స్పీడ్ కంట్రోల్ చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“ఒక్కరి నిర్లక్ష్యం… ఎన్నో కుటుంబాల జీవితాలను చీకటిలోకి నెట్టింది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.