Take a fresh look at your lifestyle.

ప్రజా కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
అర్హులైన ప్రజా కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం జిల్లాలోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా, సామాజిక భద్రత లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ, తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని, వెంటనే ప్రతి కళాకారులకు గుర్తింపు కార్డు జారీ చేసి, కనీస పారితోషికాన్ని చట్టబద్ధం చేయాలన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి భద్రతా పథకాలు తక్షణమే అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో ప్రత్యేక సాంస్కృతిక భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి భూషిపాక నర్సింహా, చెక్క వెంకటేష్, చిరుర్ల లింగం, మూల పోచయ్య, పిట్టల శంకర్, కట్ల యాదగిరి, సోమ నరసయ్య, ఇంజ హేమలత, శ్రీనివాస్, రాజప్ప, మల్లేశం, సరిత, దుప్పెల్లి చౌదరి, సుగుణమ్మ, లక్ష్మయ్య, మల్లేశం, అన్నేమైన వెంకటేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.