Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ పోలింగ్ కోసం బారులు తీరిన గ్రాడ్యుయేట్లు

  • ప్రశాంతంగా పోలింగ్
  • ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్లు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి :నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్,మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల,ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది.  నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్  లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం 122 లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు.ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ,ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.జిల్లాలో మొదటి రెండు గంటలు ముగిసిన సమయానికి (మధ్యాహ్నం 12 గంటలకు) పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 27.44 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 42.12 శాతం పోలింగ్ నమోదయ్యిందని అన్నారు.కామారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 22.13,ఉపాద్యాయ ఎమ్మెల్సీ కి 37.17 శాతం పోలింగ్ జరిగింది.కాగా పోలింగ్ స్టేషన్లు తక్కువగా ఉండడంతో ఓటర్లు బారులు తీరారు.ఎండలోనూ క్యూ పద్దతిలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.బాన్సువాడ లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు అధికంగా ఉన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.