Take a fresh look at your lifestyle.

జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జన గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా గృహ జాబితా, గృహ గణన ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని ఆయన నివాసం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ,రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితమైన జనాభా గణాంకాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. జనాభా గణన ద్వారా ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్దకు చేరుతుందని, ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకొని వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజలందరూ ఈ గణన ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్ , AMC ఛైర్మెన్ గడ్డంనారాయణరెడ్డి, కౌన్సిలర్ ప్రశాంత్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, ఎన్యూమరేటర్లు ప్రసాద్ రావు, మల్హాల్ రావు, శ్రీనివాస్, జాఫర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.