Take a fresh look at your lifestyle.

విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి – సాంకేతిక విద్యతో భవిష్యత్తు బలోపేతం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

పెన్నుతో పాటు ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ప్రతి విద్యార్థికి శక్తివంతమైన ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో, విద్యార్థుల ప్రగతికి తోడ్పడే మరో మంచి కార్యక్రమం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

ఈరోజు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తాడూరు మండలం పర్వతాయపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని సాంబ కవితకు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ప్రస్తుతం ఆమె ఇబ్రహీంపట్నంలోని శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో బి.టెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకమని, విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే కుటుంబానికి, సమాజానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

విద్య – అభివృద్ధికి మార్గం… సాంకేతికత – విజయానికి వేదిక

Leave A Reply

Your email address will not be published.