Take a fresh look at your lifestyle.

రిటైర్డ్ ఉద్యోగికి తోటి ఉద్యోగుల వీడ్కోలు

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: రామగుండం రెండవ డివిజన్ ఓసీపీ.3 ప్రాజెక్టు బేస్ వర్క్ షాప్ లో జనరల్ మజ్దూర్ గా సర్వీస్ కాలం పూర్తి చేసి, ఉద్యోగ విరమణ పొందిన రామ నర్సింగ్ ను తోటి ఉద్యోగులు గురువారం ఆత్మీయ సన్మానంతో వీడ్కోలు తెలిపారు.ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెక్షన్ సీనియర్ ఫోర్మెన్, ఐఎన్టియూసి ప్రధాన కార్యదర్శి ఎండి.అక్రమ్ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగికి, ఆయన సతీమణి కి పూలమాలలు, శాలువాలతో ఆత్మీయంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.