Take a fresh look at your lifestyle.

ఉద్యోగ విరమణ అనేది సర్వసాధారణమే

  • ఓసీపీ.1 ప్రాజెక్టు అధికారి జె.రాజశేఖర్.

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం మూడవ ఏరియా ఓసీపీ.1 ప్రాజెక్టులో ఈపి ఆపరేటర్ గా సర్వీసు కాలం పూర్తిచేసి, ఉద్యోగ విరమణ పొందిన గునుగంటి వెంకట స్వామిని స్తానిక అధికారులు, తోటి ఉద్యోగులు గురువారం ఆత్మీయ సన్మానంతో వీడ్కోలు తెలిపారు.ఉదయం ప్రాజెక్టు యాజమాన్యం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 36 సంవత్సరాలపాటు సంస్థకు సేవలందించి, ఉద్యోగ విరమణ పొందిన వెంకట స్వామిని, ఆయన సతీమణిని వేదిక పైకి ఆహ్వానించి, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రాజెక్టు అధికారి జె.రాజశేఖర్, అఫిషియేటింగ్ మేనేజర్ బి.రమేష్, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, కేంద్ర కమిటీ కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ను, తోటి ఉద్యోగులను కలుపుకుని, పూల మాలలు, శాలువాలతో ఆత్మీయంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రాజెక్టు అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనేది సహజమని, ప్రతీ ఉద్యోగికి ఎప్పటికైనా ఉద్యోగ విరమణ అనేది అనివార్యమన్నారు.ఇక వెంకట స్వామి సర్వీస్ కాలంలో ఎలాంటి రిమార్క్ లేకుండా, విధులు నిర్వహించారని కొనియాడారు. ఇక ఉద్యోగ విరమణ అనంతరం వెంకటస్వామి మిగిలిన తన శేషజీవితాన్ని సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయువరాగ్యాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ సన్మాన కార్యక్రమంలో అధికారుల సంఘం నాయకులు మధు బాబు, సంక్షేమ అధికారి సాయి స్వరూప్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సలీం, ఎండి.ఆరీఫ్, టి.ప్రవీణ్ రెడ్డి, పి.సతీష్ కుమార్, పి.రాజన్న, ఆర్.దిలీప్, ఎండి.మజార్, కిరణ్, మల్లేశ్, శంకర్, పి.రాజు, సీహెచ్.కొమురయ్య, తిరుపతి, కుమారస్వామి, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.