ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
నేపాల్, బీహార్, ఒరిస్సా జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేయు వ్యక్తుల సమాచారాన్ని సేకరింస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్ సూచనల మేరకు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరుస సంఘటన నేపథ్యంలో బుధవారం భువనగిరి పట్టణంలో షాపులు, హోటళ్లు, రిసార్ట్ లలో నేపాల్, బీహార్, ఒరిస్సా జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పని చేయు వ్యక్తుల సమాచారాన్ని సేకరించిన్నట్లు తెలిపారు. వీరి నేర చరిత్రను చెక్ చేసి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం లో నమోదు చేసిన్నట్లు చెప్పారు. దీనివలన ఈ వ్యక్తులు భవిష్యత్తులో ఎటువంటి నేరాలకు పాల్పడిన వారి వేలిముద్రల ద్వారా గుర్తించడం సులభం అవుతుందని వీరి బంధువుల వివరాలు, స్థానికతకు సంబంధించిన అంశాలు కూడా సేకరించడం జరిగిందన్నారు. భువనగిరి పట్టణ ప్రజలు, వ్యాపారులు ఎవరినైనా వ్యక్తులను పనిలోకి చేర్చుకునే ముందు వారిని పోలీస్ స్టేషన్ తీసుకువస్తే వారి నేరచరిత్ర వివరాలను చెక్ చేసి మీకు క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుందని అంతేకాకుండా భవిష్యత్తులో వారు నేరాలకు పాల్పడినచో గుర్తించడం సులభతరం అవుతుందన్నారు.