Take a fresh look at your lifestyle.

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్:
మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అమ్మవారు కొలువుదీరి గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తుల జై కాళికా దేవి స్మరణలతో కుల్చారం వీధులు మారుమ్రోగాయి.


ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.


ఆలయ కమిటీ సభ్యులు కమ్మరి శ్రవణ్ చారి, దుర్గాప్రసాద్ చారి, దశరథం చారి,అశోక్ చారి, క్రిష్ణమూర్తి చారి, కరుణాకర్ చారి, పాండురంగ చారి, వడ్ల ప్రభాకర్ చారి వడ్ల క్రిష్ణమూర్తి చారి, వడ్ల శ్రీనివాస్, నర్సింలు చారి, మురళి చారి, వడ్ల బ్రహ్మం, వీరస్వామి చారి, ఎల్లయ్య చారి, శివకుమార్ చారి, కావేశ్వర్, హరీశ్, ఈశ్వర్, సాయికిరణ్, సంతోష్, నవీన్, భూమేష్, రఘుతదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.