ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ కనెక్ట్ జిల్లా స్థాయి సెలెక్షన్లు
జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో ఈ నెల 7న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీలను వశిష్ట డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.
“50 ఏళ్ల ఎమర్జెన్సీ: భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు” అనే అంశంపై డిబేట్ ఉంటుందని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలకు కళాశాల జాతీయ సేవా కార్యక్రమ సమన్వయకర్త రవి ని 9912039609 లో సంప్రదించాలని సూచించారు.