పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రూ. 75 లక్షలతో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారితో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు..

ముందుగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ పుల్లూరీ జగదీశ్వర్ రావు గారికి తన ఛాంబర్లో సన్మానించిన ఎమ్మెల్యే విజయరమణ రావు గారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో గంగయ్య, స్థానిక సర్పంచి బంగారి రమేష్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్,రామిడి తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ కు బస్సు సౌకర్యం…
నిత్యం ప్రజల సౌకర్యార్థం ప్రయాణం…
మంత్రుల సహకారంతో త్వరలో మరిన్ని బస్సులు…
గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయ రమణారావు గారు…
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో హైదరాబాద్ కు నూతన బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణా రావు గారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ…

కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం నుండి ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం మీదుగా కరీంనగర్ నుండి హైదరాబాద్ చేరుకుంటుందని అక్కడి నుండి సికింద్రాబాద్ చేరుకొని తిరిగి కరీంనగర్ మీదుగా కాల్వ శ్రీరాంపూర్ కు చేరుకొని కరీంనగర్ లో రాత్రి బస అనంతరం తిరిగి కాల్వ శ్రీరాంపూర్ నుండి ఉదయం బయలుదేరే విధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ల సహకారంతో ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. తాను అసెంబ్లీఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పెద్దపల్లి బస్ డిపో అనంతరం గోదావరిఖని, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మీదుగా హనుమకొండ కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. గతంలో 1985.- 89 మధ్యకాలంలో స్వర్గీయ కాల్వ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 87 – 88 సంవత్సరంలో ఆరు నెలలు హైదరాబాద్ కు బస్సు సౌకర్యం ఉండేదని తిరిగి ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్,మార్కెట్ చైర్మన్ లు మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు…