ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం హవేలీఘనాపూర్ మండలం, బ్యాతోల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఆలాగే గ్రామంలో జనగణన పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా గోదాములకు తరలించడం జరుగుతుందని, గోదాములకు తరలించబడిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంపొందించుకోవాలని సూచించారు. ధాన్యం దిగుమతిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
జనగణన ఇంటింటికీ వెళ్తున్న ఎన్యూమరేటర్లతో మాట్లాడి, వివరాల నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. జనగణన ఎన్యూమరేటర్, సూపర్‌వైజర్ సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలని ఆదేశించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇది 16వ జనగణన అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన అన్నారు. ఈసారి తొలిసారిగా డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే ‘
స్వీయ గణన విధానాన్ని కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. వెంట ఆర్ఐ సిద్దు ఉన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.