రామకృష్ణాపూర్, ముద్ర : ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానంతో ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం పై భారం తగ్గి అభివృద్ధి చెందే అవకాశం ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సూపర్ బజార్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒకే ఎన్నిక విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో సిరమిక్ టైల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45 వేల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పించాల్సిన బాధ్యత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రధాన సమస్య రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ దన్ సింగ్,బంగారి వేణు,పోషం,ఈశ్వర చారి,వైద్య శ్రీనివాస్,వేముల అశోక్,సరస్వతి,శ్రీలత,లక్ష్మీ,పద్మ తదితరులు పాల్గొన్నారు.