- ప్రజలలో అవగాహన కల్పిస్తున్న ఎయిమ్స్
బీబీనగర్, ముద్ర విలేకరి: క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రాణాంతకం కాకుండా రోగిని కాపాడుకోవచ్చునని బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఎయిమ్స్ లోని చెవి,ముక్క, గొంతు శస్త్ర చికిత్సా విభాగం, తల, మెడ సర్జరీ విభాగం సంయుక్తంగా ప్రపంచ తల, మెడ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు.
వాస్తవంగా జులై 27న నిర్వహించాల్సిన ఈ దినోత్సవం సందర్భంగా అప్పటి నుంచి ఎయిమ్స్ లోని ఈ రెండు విభాగాలలు గత కొద్ది రోజులుగా లఘు నాటికలు, అవగాహనా సదస్సులు, విద్యాకార్యక్రమాల ద్వారా క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంతాసింగ్, అకడమిక్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ నితిన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్, ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ జె.అరోరా మార్గదర్శనంలో ఈ రెండు విభాగాలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. బీబీనగర్ మండలం ఇంద్రియాల గ్రామంలో కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ విభాగం సహకారంతో గత జులై 19న థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు, ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా ఎలా కాపాడుకోగలమన్నది లఘు నాటికల ద్వారా, ప్లకార్డుల ద్వారా తెలియపరిచారు. అలాగే గ్రామస్థులు సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.